తన పెళ్లిపై కథనాన్ని చూసి.. వ్యంగ్యంగా స్పందించిన శ్రుతి హాసన్

  • మైఖేల్‌తో ప్రేమలో ఉందని ప్రచారం
  • ఖండించిన శ్రుతి
  • మైఖేల్‌తో తీసుకున్న ఫోటోలను షేర్ చేసిన శ్రుతి
కథానాయిక శ్రుతి హాసన్ ప్రేమ వ్యవహారంపై మరోసారి ప్రచారం జోరందుకుంది. ఆమె.. యూరప్‌కు చెందిన మైఖేల్ కోర్సెలేతో ప్రేమలో ఉన్నారని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మైఖేల్ కూడా భారత్‌కు వచ్చి శ్రుతి కుటుంబంతో కలిసి చెన్నైలో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యారు. దీంతో వారి ప్రేమ.. పెళ్లి వరకూ వెళ్లిందని రూమర్లు వినిపించాయి. దీనిని శ్రుతి అప్పట్లో ఖండించడంతో కొన్నాళ్లుగా ఈ ప్రచారానికి తెరపడింది.

అయితే ఇటీవల ఆమె లండన్ వెళ్లారు. మైఖేల్‌తో కలిసి క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మైఖేల్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో శ్రుతి షేర్ చేసింది. దీంతో మళ్లీ శ్రుతి ప్రేమ, పెళ్లి ప్రచారం ఊపందుకుంది. ‘2019లో శ్రుతి పెళ్లంటూ ఓ వార్తాపత్రిక ఏకంగా కథనాన్ని ప్రచురించింది. ఈ వార్తను రీ ట్వీట్ చేసిన శ్రుతి.. ‘నిజమా?.. ఇది నాకు వార్తే’ అంటూ వ్యంగ్యంగా స్పందించింది.
Go Back to Shorts
Sruthi Hassan
Michel korsale
India
Chennai
Europe

More Telugu News